VKB: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ హాలులో జరిగిన కార్యక్రమంలో భూసమస్యలు, విద్యుత్, పింఛన్లు, రేషన్ కార్డులు, గృహనిర్మాణం, వ్యవసాయం, ఉపాధి అంశాలపై 125 వినతులు అందాయి. ఈ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా తీర్చాలని సూచించారు.