NGKL: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ డిపో మేనేజర్ యాదయ్య ఆదేశాల మేరకు అధికారులు ఆర్టీసీ కార్మికులకు సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎండల తీవ్రత దృష్ట్యా ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడవద్దని మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.