KRNL: పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామంలో సోమవారం ‘బడి పిలుస్తోంది’ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి, బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీపీ ఈరన్న, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.