MLG: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అంశంపై జరిగిన పరిణామాలను మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. మహిళా రిజర్వేషన్ను సులభంగా అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, కావాలని డీలిమిటేషన్ అంశాన్ని జోడించి బిల్లును సంక్లిష్టం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా హక్కుల కోసం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు.