TG: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హెరిటేజ్ విభాగం పర్యాటకులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని అన్ని మ్యూజియంలు, స్మారక కట్టడాలలో ఇవాళ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు ప్రకటించారు. మన సంస్కృతి, చరిత్రపై అవగాహన పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.