SKLM: నీలమణిదుర్గ ఆలయంలో ఈ నెల 19 నుంచి 27 వరకు 51వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు.