KNR: దుర్షేడ్ డివిజన్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ధూప దీప నైవేద్యం’ పథకంలో చేర్చాలని కోరగా, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి, నిత్య నైవేద్య కార్యక్రమాల కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.