BPT: సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ‘బిలాల్ మసీదు’ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అద్దంకి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, ప్రముఖ సెఫాలజిస్ట్, ఆరా పోల్ స్ట్రాటజీస్ అధినేత ఆరా మస్తాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన మసీదు నిర్మాణం పట్ల ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు.