VZM: ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులను పిలిపించి, వారి ప్రస్తుత జీవనోపాధి, వృత్తుల గురించి ఆరా తీశారు. నేర ప్రవర్తన వీడి, మంచి నడవడికతో సమాజంలో జీవించాలని అధికారులు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.