TG: HYDలోని పలు ప్రాంతాల్లో భారీ గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, తిరుమలగిరి, బంజారాహిల్స్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, అల్వాల్, బాచుపల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టిస్తోంది. ఈ వర్షం రాత్రి 7 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, నిజామాబాద్లో వడగండ్ల వాన కురుస్తోంది.