ఇన్‌స్టా సబ్స్క్రిప్షన్ ఫీచర్‌పై వస్తున్న విమర్శలకు నటి అనన్య నాగళ్ల గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ఫీచర్ ద్వారా కేవలం తన రోజువారి విశేషాలను అభిమానులతో పంచుకుని, వారితో టచ్‌లో ఉండటమే తన ఉద్దేశమని వెల్లడించింది. అభ్యంతరకర కంటెంట్ కోసం దీన్ని వాడుతున్నాననడం సరికాదని తెలిపింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరింది.