GDWL: గద్వాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ జయలక్ష్మి తెలిపారు. ఆదివారం 18, 21 వార్డుల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అమృత్ పథకంలో భాగంగా రూ.1.42 కోట్లు, రూ.1.24 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.