AP: భూగర్భ జలాలు పెంచడం ద్వారా విద్యుత్ భారాన్ని తగ్గించవచ్చని, ఆ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు వాడవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జలధార-జలహారతి ప్రాజెక్టుకు అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను నోడల్ అధికారిగా నియమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పుష్కరిణిలను నింపాలని, ప్రజలను ఈ నీటి సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు.