GDWL: గట్టు మండలంలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని ఎంఓ రమేష్ సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు రావద్దని, చల్లటి పానీయాలు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.