GDWL: వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో అలంపూర్ మండల ఎస్సై రామకృష్ణ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. సెలవుల సమయంలో చాలా మంది విద్యార్థులు చెరువులు, వాగులు, వంకల వద్దకు వెళ్లే అవకాశం ఉండటంతో, అలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సెలవులను సురక్షితంగా మరియు ఆనందంగా గడపాలని ఆయన ఆకాంక్షించారు.