అన్నమయ్య: మదనపల్లె మండలంలో జూదం, కోడి పందేలు నిర్వహిస్తున్న 29 మందిని అరెస్టు చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. చీకిల బైలులో పేకాట ఆడుతున్న 14 మందిని, నీరుగట్టు వద్ద కోడి పందేలు ఆడుతున్న నలుగురిని, రామాపురంలో మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి నగదు, ఫోన్లు, కోళ్లు, బైక్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు.