నిజామాబాద్ నగరంలోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే వసతి కేంద్రాల నిర్వహణ కోసం అర్హులైన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. మెప్మా, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కేంద్రాల కోసం ఆసక్తి గల సంస్థలు ఈ నెల 25లోగా నగరపాలక సంస్థలోని మెప్మా విభాగంలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.