MBNR: మిడ్జిల్ మండలంలోని మసిగుండ్లపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ భ్రమరాంబికాదేవి కాశి పంచలింగేశ్వర స్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం గ్రామ ప్రజలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.