MDCL: కీసర పరిసర ప్రాంతాలైన నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల్లో ఓవైపు ఎండలు విపరీతంగా ఉండగా, ఉక్క పోత వాతావరణం అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ గుర్తించింది. గత వారం రోజుల్లో గరిష్టంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వివరించింది. ప్రతిరోజు 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.