JN: చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన సుమారు 30మంది BRS నాయకులు ఇవాళ స్టేషన్‌ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రేస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికి కడియం కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. కొత్త పాత అనే తేడా లేకుండా పార్టీ బలోపేతానికి, గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని MLA సూచించారు.