ADB: విత్తన, ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్తో సమావేశమై కలెక్టర్ మాట్లాడారు. విత్తనాలు, ఎరువుల లభ్యతలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.