PDPL: ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని మంథని ఏఎంసీ ఛైర్మన్ కే. వెంకన్న అన్నారు. శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని అధ్వర్యంలో మండలంలోని విలోచవరం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ కొండ ప్రేమలతతో కలిసి మంథని ఏఎంసీ ఛైర్మన్ ప్రారంభించారు.