KNR: ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ బి. సుబ్బారాయుడు సూచించారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పద్మనగర్ వీర్య ఆబోతుల కేంద్రం, చిగురుమామిడిలోని గొర్రెల ఫారం, గోశాలను సందర్శించి పనితీరును సమీక్షించారు. కృత్రిమ గర్భధారణ, సార్టెడ్ సెమన్ వినియోగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.