మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నుంచి నిర్వహించిన ఊరేగింపుకు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.