KKRతో మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RR స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు సూర్యవంశీ, జైస్వాల్ తొలి వికెట్కు 8.4 ఓవర్లలో 81 పరుగులు జోడించి మంచి శుభారంభం ఇచ్చారు. అయితే, వారు ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. KKR బౌలర్లలో చక్రవర్తి, త్యాగీ తలో 3 వికెట్లు పడగొట్టారు.