AP: సింహాద్రి అప్పన్న స్వామిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. సోమవారం జరిగే చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భద్రత కోసం ఏఐ టెక్నాలజీని వాడుతున్నామన్నారు.