‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ ఈవెంట్లో హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త నటీనటులతో, తక్కువ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపాడు. సినిమా విడుదలైన మొదటి రోజే ఇందులో నటించిన ఐదారుగురికి పెద్ద చిత్రాల్లో అవకాశాలు రావడం తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.