ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా ప్రదర్శన ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ బుమ్రా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. 2013లో అరంగేట్రం చేసిన బుమ్రా, అప్పటి నుంచి MI 5 సార్లు కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, ఈ సీజన్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. అతడు ఇప్పటికైనా రాణించకపోతే ముంబై ప్లే ఆఫ్స్ చేరుకోవడం కష్టమే.