ఏటా వైశాఖ శుక్ల పక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. 2026లో అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 19న ఉదయం 10:49 గంటలకు ప్రారంభమై, 20న ఉదయం 7:27కు ముగుస్తుంది. ఉదయ తిథి లెక్కన ఏప్రిల్ 19నే పండుగ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. బంగారం కొనుగోలుకు ఏప్రిల్ 19 ఉదయం 10:49 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5:51 వరకు శుభ సమయమని, ఈ సమయంలో కొంటే మంచిదని సూచిస్తున్నారు.