TG: HYD నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు నీళ్లు లేక అల్లాడుతున్నారని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కనీసం తాగునీరు కూడా సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నీటి సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాడుతామని స్పష్టం చేశారు.