సత్యసాయి: జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు 2027 మార్చి నాటికి పంపిణీ చేయాలని తెలిపారు.