తిరుపతిలోని శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమావాస్య పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అమ్మవారికి శాస్త్రోక్తంగా విశేష అభిషేక సేవలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అందంగా అలంకరించి ఊరేగించారు. ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తిపాటలు, కోలాటాల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.