BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం దమ్మపేట మండల కేంద్రంలోని వినాయక ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలు, నివారణపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్‌తో కలిసి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.