TG: మహిళా బిల్లుపై బీజేపీ కపట నీతి బయటపడిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. డీలిమిటేషన్‌తో లింక్ పెట్టి మహిళలను బీజేపీ మోసం చేస్తోందని.. రాబోయే తమిళనాడు, బెంగాల్ ఎన్నికల కోసమే ఈ కొత్త నాటకాలని విమర్శించారు. మహిళా ప్రధాని, రాష్ట్రపతిని చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని, స్థానిక సంస్థల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది తమ పార్టీయేనని గుర్తుచేశారు.