TG: బీజేపీకి చిత్తశుద్ధి లేకపోవడంతోనే పార్లమెంటులో బిల్లు పాస్ కాలేదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే మహిళా బిల్లును, డీలిమిటేషన్ బిల్లును కలిపి పెట్టారని ఆయన ఆరోపించారు. బిల్లు వీగిపోవడంబీజేపీ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు అని పేర్కొన్నారు. మహిళల సాధికారతపై కేంద్రానికి నిజాయితీ లేదని ఈ ఘటనతో స్పష్టమైందంటూ ఆయన ధ్వజమెత్తారు.