ASF: జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో DEO లలితతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రం మంజూరు చేసిన 18 పాఠశాలల నిధులను మౌలిక వసతులు, విద్యా బోధన కోసం సక్రమంగా వినియోగించాలని సూచించారు. విద్యార్థుల నమోదును పెంచడంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.