BDK: కొత్తగూడెంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు, డీఏలు విడుదల, హెల్త్ కార్డులు, సీపీఎస్ రద్దు వంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.