ADB: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బోథ్ JFCM న్యాయమూర్తి సందీప్ కుమార్ 5 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఇచ్చోడ CI బండారి రాజు శుక్రవారం తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణ నష్టం సంభవిస్తుందన్నారు. ప్రమాదాలకు కారణమవుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారి పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నదని CI రాజు పేర్కొన్నారు.