KNR: గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతి గృహ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలికలకు వసతులు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. శుక్రవారం రాత్రి కరీంనగర్లోని రామ్ నగర్లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.