AP: కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కడుపు నింపింది అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వేట నిషేధ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచి లక్షలాది కుటుంబాలకు భరోసా ఇచ్చిందన్నారు. ఒకే ఏడాదిలో రూ.242 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. వారిని మోసం చేసింది జగన్ ప్రభుత్వం అని విమర్శించారు. మత్స్యకారుల హక్కులను కాలరాసిన జగన్కు వారి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.