VKB: బంట్వారం మండల వ్యాప్తంగా వీధి కుక్కల బెడద మితిమీరిపోవడంతో ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. గ్రామాల్లో కుక్కల గుంపులు స్వైరవిహారం చేస్తూ పిల్లలు, వృద్ధులు, మహిళలపై దాడులకు తెగబడుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఇప్పటికే పలువురు కుక్కల బారిన పడి గాయపడ్డారని, అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని సూచించారు.