HNK: పరకాల పట్టణంలో మడికొండ సుమన్ భరత్ (38) అదృశ్య ఘటన హత్యగా తేలింది. భర్తను అడ్డుతొలగించుకోవాలని భార్య లావణ్య తన ప్రియుడు, తమ్ముడు సహా కిరాయి హంతకులతో కలిసి హత్య చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈకేసులో భార్యతో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవిందరావుపేటకు చెందిన హంతకులకు రూ. 5 లక్షల సుపారీ ఇచ్చారని తెలిపారు.