WGL: ఖిలా వరంగల్ మండల కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సమాచారం మేరకు 8 మందిని టాస్క్ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.02లక్షల నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.