నారాయణపేట ఆర్డీవో రామచందర్ నాయక్ జనన ధ్రువీకరణ పత్రాల కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అనంతరం చేసిన సోదాల్లో రూ.10.20 లక్షల నగదు, భూత్పూరులో 3.18 ఎకరాల వ్యవసాయ భూమి, జడ్చర్ల, మహబూబ్నగర్లో ప్లాట్లు ఉన్నట్లు వెల్లడైంది. గతంలో గద్వాల, వనపర్తిలో కూడా అక్రమాల ఆరోపణలు ఉన్నాయని DSP బాలకృష్ణ తెలిపారు.