SRD: పుల్కల్ మండల కేంద్రానికి చెందిన లస్కరి రాంచరణ్ ఇండియన్ మర్చంట్ నేవీకి ఎంపికయ్యారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో ఇంటర్ వరకు చదివిన రాంచరణ్, NCCలో చురుగ్గా ఉంటూ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఈ ఘనత సాధించారు. తమ స్వగ్రామ యువకుడు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.