NLG: ప్రజా ప్రభుత్వంతోనే పేదలకు ఇంటి కల సొంతమవుతుంది మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కామపల్లిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం పేదల ఆశీర్వాదం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.