MBNR: రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నేత మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఎదుట జరిగిన నిరసనలో మాట్లాడుతూ.. ఐదు డీఏలు మంజూరు చేయాలని, పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. హెల్త్ కార్డులు, పదోన్నతుల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.