BHPL: హెల్మెట్ లేకుండా బైక్ నడపడం ప్రమాదకరమని గోరికొత్తపల్లి SI సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డి హెచ్చరించారు. మీ కుటుంబం కోసం, మీకోసం అనే సందేశంతో ఓ పోస్టర్ రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోడ్డు భద్రతా అవగాహన కల్పిస్తున్నారు. “మీ ప్రాణ రక్షణ కోసం తప్పకుండా హెల్మెట్ ధరించండి.. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించండి” అని SI సూచించారు.