AKP: మహిళలు, బాలికల సంరక్షణకు అనేక చట్టాలు అమలులో ఉన్నాయని సీఐ రామచంద్రరావు తెలిపారు. ఆదివారం సబ్బవరంలో మహిళలు, బాలికల సంరక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు.