BDK: భద్రాద్రి గోదావరి తీరంలో ఆదివారం సాయంత్రం నదీ హారతి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో 108 ప్రమిదలతో దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. స్వామివారికి 12 సార్లు, గోదావరికి 21 సార్లు హారతులు సమర్పించారు. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.